కౌటాల: గ్రామీణ రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈ ఉత్తమ్ జాడె అన్నారు. కౌటాల మండలం గుడ్లబోరి గ్రామంలో నిర్మిస్తున్న సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో విద్యుత్ సబ్‌స్టేషన్లను ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. అలాగే తాటిపల్లిలో పొలంబాట కార్యక్రమంలో భాగంగా మిర్చి పంటలను పరిశీంచారు. రైతులకు సరిపడా విద్యుత్ సరఫరా చేస్తామని, విద్యుత్ పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏడీఈ ఇర్ఫాన్, సంతోష్ తదితరులు ఉన్నారు.


