‘కాంగ్రెస్‌ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం’ | - | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం’

Oct 22 2026 12:09 AM | Updated on Oct 22 2026 12:09 AM

ఆసిఫాబాద్‌క్రైం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ వార్డు నంబర్‌ 4 కౌన్సిలర్‌ చల్లగొండ భాగ్యలక్ష్మి కుమారుడు, బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు చల్లగొండ శ్రీకాంత్‌ ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అలాగే మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ గొడిసెల ఎల్లేష్‌, యువ నాయకుడు ఎన్నం శ్రీకాంత్‌ సైతం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారిని కండువాలు కప్పి ఆహ్వానించారు. మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్సీ విఠల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement