ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని సాక్షి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు కోచ్ విద్యాసాగర్ తెలిపారు. గత నెల 26, 27 తేదీల్లో హనుమకొండలో జరిగిన అథ్లెటిక్స్ హెప్టాథ్లాన్ (7 ఈవెంట్ గ్రూప్) పోటీల్లో ప్రతిభ చూపి మూడోస్థానంలో నిలిచింది. 100, 200, 1000 మీటర్స్ రన్నింగ్, హర్డిల్, లాంగ్‌జంప్, షాట్‌ఫుట్, జావెలిన్ త్రో ఈవెంట్స్‌లో 4035 పాయింట్స్ సాధించింది. ఈ నెల 23 నుంచి 27 వరకు చైన్నెలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో సాక్షి పాల్గొననుంది. కాగా, సాక్షి ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలో చదువుతూ జిల్లా కేంద్రంలోని గిరిజన పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఉంటోంది. గిరిజన ఆదర్శ బాలికల క్రీడాపాఠశాల కోచ్ విద్యాసాగర్ వద్ద శిక్షణ తీసుకుంటోంది.


