ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి

Oct 20 2026 12:14 AM | Updated on Oct 20 2026 12:14 AM

● జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్‌వో దాసరి వేణుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జైనూర్‌కు చెందిన ఆత్రం శంభు మీసేవ కేంద్రం మంజూరు చేయాలని, జిల్లా కేంద్రానికి చెందిన వేములవాడ రవీందర్‌ తాను ప్రభుత్వ ఆసుపత్రిలో దోబిగా పనిచేస్తున్నానని, ఆరోగ్యం సహకరించడంలేదని, కుటుంబ సభ్యులో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని, సిర్పూర్‌(టి) మండలం లక్ష్మీపూర్‌కు చెందిన రాకేష్‌ కుమార్‌ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, చింతలమానెపల్లి మండలం డబ్బాకు చెందిన జామ్మిడి అరుణ ఉపాధి అవకాశం కల్పించాలని, కాగజ్‌నగర్‌ మండలం అనుకూడకు చెందిన శంకర్‌ వంటగది నిర్మాణానికి సంబంధించిన బిల్లు మంజూరు చేయాలని, జైనూర్‌ మండలం పొలాసకు చెందిన కుర్సింగ సురేఖ ఆసిఫాబాద్‌ మండలం ఇప్పలనవెగాంకు చెందిన గుర్నులె ఉషారాణి అంగన్‌వాడీ టీచర్‌ ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement