వైభవంగా దుర్గాదేవి నవరాత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా దుర్గాదేవి నవరాత్రోత్సవాలు

Oct 20 2026 12:14 AM | Updated on Oct 20 2026 12:14 AM

రెబ్బెన: మండలంలో దుర్గాదేవి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గోలేటి, రె బ్బెన, నంబాల, గంగాపూర్‌ గ్రామాల్లో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఇందిరానగర్‌లోని కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. వేదపండితు ల మంత్రోచ్చరణల నడుమ చండీహోమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అ మ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న కాలభైరవ స్వా మి, అరుణాచల శివయ్యలను దర్శించుకున్నారు. భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో ఇందిరానగర్‌ సర్పంచ్‌ దారావత్‌ అరుణ, ఉప సర్పంచ్‌ వెంకటేష్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్‌గౌడ్‌, జిల్లా కార్యదర్శి చిరంజీవిగౌడ్‌, చెన్న సోమశేఖర్‌, నాయకులు రాజేశ్‌, సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement