ఆధునిక పద్ధతులు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఆధునిక పద్ధతులు పాటించాలి

Oct 18 2026 1:48 AM | Updated on Oct 18 2026 1:48 AM

కాగజ్‌నగర్‌రూరల్‌: ఆధునిక పద్ధతులతో పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సిర్పూ ర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు సూచించారు. శనివారం మండలంలోని ఈజ్‌గాం గ్రామంలోని శివమల్లన్న ఆలయ సమీపంలోగల కాగజ్‌నగర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రూ.10లక్షలతో కొనుగోలు చేసిన వ్యవసాయ డ్రోన్‌ను ప్రారంభించి మాట్లాడారు. డ్రోన్‌ ద్వారా రోజుకు 30ఎకరాల పంటలకు పురుగుల మందులను పిచికారీ చేయవచ్చని, ఇందుకు ఎకరాకు రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అగ్గిల సంగీత, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఉమామహేశ్వర్‌రావు, డైరెక్టర్లు రాములు, నానాజీ, తిరుపతి, డీఏవో వెంకట్‌, ఏడీఏ మనోహర్‌, ఏవో రామకృష్ణ, ఏఈవోలు, సెక్రటరీ సతీశ్‌, రైతులు పాల్గొన్నారు.

18గంటలు కరెంట్‌ సరఫరా చేయాలి

ఆసిఫాబాద్‌ క్రైం: సిర్పూర్‌ నియోజకవర్గంలో సాగు చేసిన వరి, మిర్చి తదితర పంటల కోసం 18గంటల పాటు నిరంతరంగా కరెంట్‌ సరఫరా చేయాలని ఉత్తర తెలంగాణ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ సీఎండీ వరుణ్‌రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యే హరీశ్‌బాబు తెలిపారు. తన నివాసంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లో మిర్చి సాగు చేస్తున్న తమకు పగటివేళ 12గంటలు, రాత్రివేళ 6 గంటలు కరెంట్‌ సరఫరా చేయాలని, ఆయా మండలాల రైతుల విజ్ఞప్తి మేరకు సీఎండీతో మాట్లాడగా ఆయన అంగీకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులు విద్యుత్‌ అధికారులతో సమన్వయం చేసుకుని మిర్చి పంటను కాపాడుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement