మున్సిపల్‌ కార్మికుల సమ్మె విరమణ | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కార్మికుల సమ్మె విరమణ

Oct 18 2026 1:48 AM | Updated on Oct 18 2026 1:48 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమించారు. డిమాండ్లు నెరవేర్చాలని నా లుగు రోజులుగా కార్మికులు సమ్మె చేపట్టి నిరసన తెలుపుతుండగా శనివారం శిబిరాన్ని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులకు రూ.10 వేల అడ్వాన్స్‌ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. రూ.5 వేలు మున్సిపల్‌ నిధుల నుంచి మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి కార్మికుల ఖాతాల్లో జమ చేశారని, మిగతా రూ.5వేలు కలెక్టర్‌ నిధుల నుంచి శనివారం సాయంత్రంలోపు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దసరా పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని సూచించారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానా, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement