కెరమెరి: నిరుపేద రోగులకు నాణ్యమైన వై ద్యసేవలు అందించాలని డీఎంహెచ్వో నా గేంద్ర సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శనివారం ఆయ న సందర్శించారు. వార్డులు, పరీక్షా గదులు, ప్రయోగశాల, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. వైద్యులు, సి బ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు అవసరమైన మందులు, వైద్య పరికరా లు, సామగ్రి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పీహెచ్సీ ఆవరణతో పాటు వార్డులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూ డాలని, ఎప్పటికప్పుడు రికార్డులు అప్డేట్ చేయాలని సూచించారు. హైరిస్క్ గర్భిణుల పై ప్రత్యేకదృష్టి సారించి క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, పీహెచ్సీల్లోనే వందశాతం ప్రసవాలు జరిగేలా చూడాలని, విధులను ని ర్లక్ష్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.


