లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవలు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

Oct 17 2026 6:36 AM | Updated on Oct 17 2026 6:36 AM

● కలెక్టర్‌ కె. హరిత

ఆసిఫాబాద్‌క్రైం: జిల్లాలో ఇంపాక్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కె. హరిత అన్నారు. శుక్రవారం కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ ఆవరణలో లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉచిత వైద్య సేవలను సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో ని ర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారన్నారు. శిబిరంలో కంటి, చెవి, అర్థోపెడిక్‌, పెదవి చీలక, కాలిన గాయాలు, దంత చికిత్స, ప్లాస్టిక్‌ సర్జరీ వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఎమ్మె ల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ 1991లో ప్రారంభమైన ఈ రైలు ఇప్పటి వరకు అనేక రాష్ట్రాలలో 256 ప్రాజెక్టులను పూర్తి చేసిందన్నారు. కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో 2022లో సేవలు అందించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి నాగేంద్ర, తహసీల్దార్‌ మల్లెపూల మధూకర్‌, కమిషనర్‌ తిరుపతి, ఫౌండేషన్‌ నిర్వాహకులు డాక్టర్‌ రోహిణి, మనోహర్‌ రెడ్డి, వలంటీర్లు పాల్గొన్నారు.

లాటరీ పద్ధతిలో బార్‌ కేటాయింపు

ఆసిఫాబాద్‌అర్బన్‌: లాటరీ పద్ధతిలో బార్‌ కేటా యించినట్లు కలెక్టర్‌ కె.హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆదిలాబాద్‌ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డితో కలిసి ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీకి మంజూరైన నూతన బార్‌ కేటాయించే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ఆసిఫాబా ద్‌ మున్సిపాలిటీకి నూతన బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ మంజూరు కాగా, ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా, మొత్తం 207 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తులు చేసుకున్న వారి సమక్షంలో లక్కీ లాటరీ పద్ధతిలో ఎంపిక చేయగా 102 నంబర్‌ గల మల్లుగారి రమేశ్‌గౌడ్‌ను లాటరీ వరించిందని తెలిపారు. బార్‌ నిర్వహణలో ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. జిల్లా ఆబ్కారీ మధ్య నిషేధ అధికారి లక్ష్మినాయక్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement