ఆసిఫాబాద్‌అర్బన్: పోలీసుశాఖలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ రికార్డులు నిర్వహించడం ఎంతో కీలకమని కాళేశ్వరం మల్టీజోన్– 1 డీఐజీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. వార్షిక తనిఖీ ల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఎస్పీ నితిక పంత్‌తో కలిసి సందర్శించారు. డిస్ట్రిక్ క్రైం రికార్డ్స్ బ్యూరో విభా గాన్ని తనిఖీ చేసి నేరాల రికార్డులు, కేసుల వివరా లు, నేరస్తుల డేటా, పెండింగ్ కేసులకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు, ఫైళ్ల నిర్వహణను పరిశీ లించారు. అనంతరం ఫింగర్ ప్రింట్, కమాండ్ కంట్రోల్ విభాగాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. కేసులు, నేరాలకు సంబంధించిన సమాచారం అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. సిబ్బంది విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూ చించారు. అనంతరం ఉచిత పోలీసు శిక్షణ శిబిరంలో అభ్యర్థులతో మాట్లాడారు. సన్నద్ధతకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. శిక్షణను స ద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో ప్రతిభ చూ పాలని సూచించారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆయన వెంట ఏఎస్పీ చిత్తరంజన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సతీశ్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.


