పండుగ పూట పస్తులేనా..? | - | Sakshi
Sakshi News home page

పండుగ పూట పస్తులేనా..?

Oct 16 2026 7:23 AM | Updated on Oct 16 2026 7:23 AM

● మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల నిరసన

కాగజ్‌నగర్‌టౌన్‌: బతుకమ్మ, దసరా పండగల కు కూడా కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధి లోని 30 వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు అందడం లేదు. మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానాకు పలుమార్లు వినతిపత్రాలు అందించినా స్పందించడం లేదంటూ బుధవారం రాత్రి కార్యాలయం ఎదుట నిద్రించి నిరసన తెలిపారు. ఇక గురువారం కార్యాలయం ముందు నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ ఏటా పారిశుద్ధ్య కార్మికులు పండగల సమయంలో నిరసనలు చేపట్టనిదే వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు. నిధుల కొరత ఉందంటూ అధికారులు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. వెంటనే వేతనాలతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ చెల్లించాలన్నారు. నిరసనల్లో కార్మికులు శంకర్‌, సంజీవ్‌, తదితరులు పాల్గొన్నారు. కాగా, మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో నిరసన తెలుపుతున్న పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనిత, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని, అలాగే వారికి యూనిఫాం, సెఫ్టీ వస్తువులను అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వలీ, రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement