పారదర్శకంగా అంగన్‌వాడీ పోస్టుల ఎంపిక ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా అంగన్‌వాడీ పోస్టుల ఎంపిక ప్రక్రియ

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

● కలెక్టర్‌ కె.హరిత

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలోని ఐదు ఐసీడీఎస్‌ ప్రాజక్టుల పరిధిలో అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వరూపారాణితో కలిసి సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దరఖాస్తులు భా రీగా వచ్చే అవకాశం ఉందని, విద్య అర్హత, వ యస్సు, స్థానికత, రిజర్వేషన్‌, వితంతువులు, అనాథలు, దివ్యాంగులు వంటి ధ్రువపత్రాల ను సక్రమంగా పరిశీలించాలని సూచించారు.

‘భూ భారతి’పై అవగాహన ఉండాలి

ఆసిఫాబాద్‌: భూభారతి నూతన మాడ్యూల్స్‌లోని అంశాలపై అవగాహన ఉండాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి బుధవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, డీఆర్వో వేణుతో కలిసి జూమ్‌ మీటింగ్‌ ద్వారా తహసీల్దార్లతో సమీక్షించారు. నూతన మాడ్యూల్స్‌లో పలు సవరణలకు అవకాశం కల్పించారని తెలిపారు. కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లో పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని, భూముల రీసర్వేపై దృష్టి సారించాలని సూచించారు.

మెరుగైన వైద్య సేవలందించాలి

ఆసిఫాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నా రు. కలెక్టరేట్‌లో బుధవారం సూపరింటెండెంట్‌ కిరణ్‌, ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ వెంకట్‌తో కలిసి వైద్యాధికారులు, వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. గైర్హాజరయ్యే ముందు సరైన అనుమతి పొందాలని సూచించారు. గర్భిణులు ఆస్పత్రుల్లోనే ప్రసవం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా సేవలందించాలని, ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement