ఆసిఫాబాద్: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవా రం అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి మార్కెటింగ్, రవాణా, విద్యుత్, వ్యవసాయ, అగ్నిమాపక, తూని కలు, కొలతలు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, సీసీఐ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2026– 27 సీజన్‌లో జిల్లాలో 3.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని, 26,44,000 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.8,667 మద్దతు ధర ప్రకటించిందన్నారు. జిన్నింగ్ మిల్లుల యజమానులు విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకో వాలని, అగ్నిమాపక శాఖ అధికారులు మిల్లులను సందర్శించి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. తూనిక ల కొలతల శాఖ అధికారులు తూకం యంత్రాలను సరిచేసి స్పష్టమైన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. రైతులు కిసాన్ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారులు వివరాలను సక్రమంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో మార్కెటింగ్ ఏడీ అశ్వయ్ అహ్మద్, డీఏవో వెంకట్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఉత్తం జాడె, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
15న జన్కాపూర్‌లో కిసాన్ మేళా
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో ఈ నెల 15న ఉదయం 10 గంటలకు కిసా న్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, ఆత్మ చైర్‌పర్సన్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ శాఖ ల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి వ్యవసాయ రంగంలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతలు, వినూత్న సాగు విధానాలు, ప్రభు త్వ పథకాల గురించి వివరిస్తామని పేర్కొన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు.


