రెబ్బెన: సింగరేణి ఆధ్వర్యంలో ఈ నెల 16న గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి హైస్కూల్ మైదానం, మాదారం టౌన్‌షిప్‌లోని రామాలయం ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుంచి సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించన్నుట్లు జీఎం శ్రీరమేశ్ తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో మంగళవారం అన్ని విభాగాల అధిపతులతో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 15న సాయంత్రం 4 గంటల నుంచి గోలేటి సింగరేణి హైస్కూల్ మైదానంతోపాటు మాదారం టౌన్‌షిప్ కమ్యూనిటీ హాల్ ఆవరణలో మహిళలకు క్రీడాపోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మలకు ప్రఽథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు ఎంపిక చేసిన మరో పది బతుకమ్మలకు ప్రోత్సాహక బహుమతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాపోటీలు, బతుకమ్మ ఆడిన మహిళలకు 150 వరకు బహుమతులు అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీజీఎంలు ఉజ్వల్‌కుమార్ బెహరా, కిరణ్‌బాబు, ఏరియా ఇంజినీర్ వీరన్న, ఎస్వోటూజీఎం స్వామిరాజు, ఖైరిగూర మేనేజర్ శంకర్, ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్, సివిల్ ఎస్‌ఈ శ్రీధర్, సీనియర్ పీవో శ్రీనివాస్, ప్రశాంత్, ఐటీ హెచ్‌వోడీ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.


