రీసర్వేకు మండలానికి రెండు బృందాలు | - | Sakshi
Sakshi News home page

రీసర్వేకు మండలానికి రెండు బృందాలు

Oct 13 2026 12:05 AM | Updated on Oct 13 2026 12:05 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: భూముల రీ సర్వేకు ప్రతీ మండలం నుంచి రెండు బృందాలను ఏర్పాటు చేయాల ని చీఫ్‌ కమిషన్‌ ల్యాండ్‌ రెవెన్యూ సీసీఎల్‌ఏ లోకేశ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాల యం నుంచి సోమవారం కలెక్టర్లు, అదనపు కలెక్ట ర్లు, సర్వే ల్యాండ్‌ అధికారులతో జూమ్‌ మీటింగ్‌ ద్వారా వివిధ అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ మండలం నుంచి నాయబ్‌ తహసీల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయిలో రెండు బృందాలను ఏర్పాటు చేసి ప్రతీ బృందంలో సర్వేయర్‌, లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ ఉండేలా చర్యలు తీసుకో వాలన్నారు. సర్వే విధానం, యంత్రాల వినియోగంపై అవగాహన ఉండేలా మాస్టర్‌ శిక్షకులతో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. 22ఏ భూములపై ప్రత్యే క దృష్టి సారించాలని సూచించారు. భూభారతి సవరణల కోసం వచ్చే దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, సర్వే ల్యాండ్‌ రికార్డ్‌ ఏడీ వినయ్‌తో కలిసి హాజరయ్యా రు. ప్రతీ మండలం నుంచి రీసర్వే కోసం రెండు బృందాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చామని తెలిపా రు. జిల్లాలో రీసర్వేకు ఉపయోగించే రోవర్లు 13 ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement