కౌటాల: గ్రామాల్లో ఈ నెల 22 నుంచి కుష్ఠు అనుమానితుల గుర్తింపు సర్వే పకడ్బందీగా చేపట్టాలని డీఎంహెచ్‌వో సిడాం నాగేంద్ర అ న్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లోని ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లకు లె ప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్(ఎల్‌సీడీసీ) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ యన మాట్లాడుతూ అనుమానితులను ప్రా రంభ దశలోనే గుర్తించి పరీక్షలు చేస్తే సరైన చికిత్సతో రోగం నయం చేయవచ్చన్నారు. ఒంటిపై మచ్చలు ఉన్నవారు పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యులు కార్తీక్‌బాబు, రాజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నా రు.


