ఆసిఫాబాద్: దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని, ప్రతీ కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నర్ రమేశ్ అన్నారు. బీసీల ధర్మపోరాట దీక్షలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు జ నాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన ఎంతో అవసరమన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, ఎమ్మార్పీఎస్ నాయకులు రేగుంట కేశవరావు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు అవిడపు ప్రణయ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వైరాగడే మారుతి పటేల్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లోబడే లవ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి గాజుల జక్కయ్య, ఉపాధ్యక్షుడు పురుషోత్తం బాలేశ్, మాలి సంఘం నాయకులు శంకర్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు అనుమాండ్ల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.


