ఆసిఫాబాద్‌అర్బన్: వినియోగదారులకు మె రుగైన విద్యుత్ అందించాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఉత్తం జాడె అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. ఫీడర్ల వారీగా విద్యుత్ లోడ్, పీక్ అవర్స్‌లో డిమాండ్, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యంపై అధికారులతో సమీక్షించారు. ఏడీఈ (ఆపరేషన్) దుస్సా శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
విద్యుత్ ప్రమాదాల నివారణకు ‘జీరో యా క్సిడెంట్’ లక్ష్యంతో సమగ్ర భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్‌ఈ ఉత్తమ్ జాడె ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వర కు 467 మిడిల్ పోల్స్, 173 స్తంభాలు, 8 వేల మీటర్ల నూతన విద్యుత్‌లైన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


