కాగజ్‌నగర్‌టౌన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల సాధనకు పట్టణంలోని ఏడీసీసీ బ్యాంక్ ఉద్యోగులు శుక్రవారం బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పెండి ంగ్‌లో సమస్యలు పరిష్కరించాలని, ఐదు రో జుల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ వైస్‌ప్రెసిడెంట్ ఆజ్మీరా రాజేందర్, డైరెక్టర్లు గోగర్ల శ్రీనివాస్, సాయిచరణ్, శ్రీనివాస్, అనిల్‌కుమార్, తిరుపతి, గణపతి, హేమంత్, అజయ్ కుమార్, శ్రీవాణి, రవితేజ పాల్గొన్నారు.


