ఆసిఫాబాద్: జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీ సుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవడ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించా రు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ పోస్టులను ఒక సంవత్సర కాల పరిమితికి ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య, శిక్షణ అందించడంతో పాటు అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన వైద్యబోధనా సిబ్బంది ని సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు.


