అటవీ అమరుల త్యాగాలు మరువలేనివి | - | Sakshi
Sakshi News home page

అటవీ అమరుల త్యాగాలు మరువలేనివి

Sep 12 2026 12:00 AM | Updated on Sep 12 2026 12:00 AM

● జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి

ఆసిఫాబాద్‌అర్బన్‌: అటవీశాఖలో విధులు నిర్వహిస్తూ అమరులైన వారి త్యాగాలు మరువలేనివని జిల్లా అటవీ అధికారి బాలమణి అన్నారు. అటవీ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయ ఆవరణలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి శ్రీనివాస్‌ జ్ఞాపకార్థం ఏటా సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అటవీ సంరక్షణలో అమరులైన 26 మంది త్యాగాలు వెలకట్టలేనివన్నారు. రాత్రిపూట వచ్చే సమాచారాలకు జట్టుగా వెళ్లాలని సూచించారు. అనంతరం జెండా ఊపి బైక్‌ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు మహేందర్‌, రమాదేవి, గోవింద్‌ చంద్‌ సర్దార్‌, రమేశ్‌, మజారుద్దీన్‌, జానియర్‌ ఫారెస్టు అసోసియేషన్‌ అధ్యక్షుడు యోగేష్‌ కులకర్ణి, సభ్యులు సద్దాం హుస్సేన్‌, సాయి, డిప్యూటి రేంజ్‌ అధికారులు విజయ్‌ ప్రకాష్‌, ఝాన్సీరాణి, ఇక్బాల్‌, జమీల్‌, శాబాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement