ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని వాసవీ మందిరంలో శనివారం ప్రారంభమైన ఎక్కాహం ఆదివారం మధ్యాహ్నం ముగిసింది. ఈ సందర్భంగా 24గంటల పాటు నిరంతర భజన నిర్వహించారు. ముగింపు సందర్భంగా మహిళలు, భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. భక్తి పారవశ్యంతో సామూహికంగా ఆలపించిన భజన ఆకట్టుకుంది. కార్యక్రమంలో చివరగా గోపాలకాలా ఉట్టి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేపట్టారు. అర్చకుడు ముదిగొండ రాజశేఖరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ఎల్లారానికి చెందిన అన్నాజి భజన బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన భజన ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.


