అడ్రస్‌ ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

అడ్రస్‌ ఎక్కడ?

Aug 24 2026 6:57 AM | Updated on Aug 24 2026 6:57 AM

● నేటికీ అందని స్కూల్‌ యూనిఫాంలు ● ఇటీవలే పాఠశాలలకు వచ్చిన వస్త్రం ● మహిళా సంఘాలకు కుట్టు బాధ్యత ● పాత దుస్తుల్లోనే వస్తున్న విద్యార్థులు

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యాశాఖ పరిస్థితి మాటల్లో ఆర్భాటం.. చేతల్లో నిస్తేజం అన్న చందంగా తయారైంది. పాఠశాలల పునఃప్రారంభం నాడే పాఠ్యపుస్తకాలతోపాటు యూనిఫాంలు, బ్యాగులు, షూలు, సాక్స్‌లు ఇస్తామని ప్రకటించినా నేటికీ అందించలేకపోయింది. పాఠశాలలు ప్రారంభమై 75 రోజులు గడిచినా ఏకరూప దుస్తులు విద్యార్థులకు అందలేదు. దీంతో విద్యార్థులు చిరిగిన పాత యూనిఫాంలు, రంగురంగుల దుస్తులతో పాఠశాలలకు వస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం లోపు ఒక జత యూనిఫాం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో అమలు చేయలేకపోయింది. యూనిఫాంకు సంబంధించి వస్త్రం పూర్తి స్థాయిలో ఇంకా చేరుకోలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

వస్త్రం సరఫరాలో ఆలస్యం

జిల్లాలో డీఈవో పరిధిలో 733 పాఠశాలలున్నాయి. ఇందులో 15 కేజీబీవీలు, 694 లోకల్‌ బాడీ స్కూళ్లు, రెండు మోడల్‌ స్కూళ్లు, ఒక యూఆర్‌జేసీ ఉండగా, ఈ విద్యాసంవత్సరంలో 45,273 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరి కోసం ఇప్పటివరకు 2,67,374 మీటర్ల వస్త్రం వచ్చింది. మరో 30శాతం వస్త్రం రావాల్సి ఉండగా, త్వరలోనే వస్తుందని వి ద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌, మే లో రావాల్సిన క్లాత్‌ ఆగస్టులో రావడంతో యూని ఫాంలు కుట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

ఆసక్తి చూపని కొన్ని సంఘాలు

మహిళా సంఘాల సభ్యులకు యూనిఫాంలు కు ట్టేందుకు అవకాశమివ్వగా కొన్ని గ్రామాల్లో ఆయా సంఘాలు ఆసక్తి చూపడం లేదు. వస్త్రం తీసుకు నేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిసింది. దీంతో యూ నిఫాంల పంపిణీ మరింత జాప్యమయ్యే అవకాశముంది. ఇటీవల షూస్‌ ఇచ్చి సాక్స్‌లు ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement