ఆలోచనల బాట.. సృజనాత్మక ఆట | - | Sakshi
Sakshi News home page

ఆలోచనల బాట.. సృజనాత్మక ఆట

Aug 20 2026 3:34 AM | Updated on Aug 20 2026 3:34 AM

కృత్రిమ మేధస్సు: మిత్రమా.. సాధనమా.. ముప్పా?

ఎలక్ట్రిక్‌ వాహనాలు(ఈవీ) : భవిష్యత్తు మార్గం

అంతర్‌ నక్షత్ర నివాసాలు/అంతరిక్ష నివాసాలు

సముద్రాల పునరుద్ధరణ: భవిష్యత్‌ తరాల పరిరక్షణ

29న ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ‘సైన్స్‌ డ్రామా ఫెస్టివల్‌’

నేటితో ముగియనున్న ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనా విధానం, సృజనాత్మకతను వెలికితీసేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏటా సైన్స్‌ డ్రామా ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు నిర్ణయించిన నాలుగు అంశాల నుంచి ఒకదాన్ని ఎంచుకుని బృందంగా 30 నిమిషాలపాటు ప్రదర్శన ఇవ్వాలి. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 20లోగా గూగుల్‌ ఫామ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ నెల 29న జిల్లాస్థాయి డ్రామా పోటీలు నిర్వహించనున్నారు. ఈ డ్రామా ప్రదర్శన విద్యార్థులకు శాసీ్త్రయ విజ్ఞానాన్ని అందించడంతో పాటు భవిష్యత్తులో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. సైన్స్‌ డ్రామా ప్రదర్శనలో ఏటా జిల్లా స్థాయి ప్రతిభావంతులు రాష్ట్రస్థాయిలో పాల్గొంటున్నారు. 2022లో కౌటాలలోని ఇన్‌ఫంట్‌ జీసస్‌ ఉన్నత పాఠశాల, 2023లో తెలంగాణ మోడల్‌ స్కూల్‌(ఆసిఫాబాద్‌), 2024, 2025లలో రెండుసార్లు జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైన్స్‌ డ్రామా ప్రదర్శనలో రాష్ట్ర స్థాయిలో పాల్గొని బహుమతులు పొందారు.

నైపుణ్యం, ఆలోచనలు మెరుగు

సైన్స్‌ డ్రామా ప్రదర్శన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకత బయటకు వస్తాయి. నాటకాల్లో ప్రదర్శనతో సొంత సృజనాత్మకత పెరిగి భావోద్వేగాలు తగ్గుతాయి. శాసీ్త్రయ విషయాలను సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు నైపుణ్యాలు మెరుగవుతాయి. విషయ అవగాహనతో క్లిష్టమైన సైన్స్‌ సిద్ధాంతాలను నాటకం ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు. సహకా ర భావన పెరిగి భయాలు తొలగిపోతాయి. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రస్తుతం సాంకేతిక సమాజంలో కృత్రిమ మేధస్సు(ఏఐ), డిజిటల్‌ వ్యవస్థపై అవగాహన వస్తుంది. ఎలక్ట్రిక్‌ వాహనాలతో కలిగే ఉపయోగాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు శాసీ్త్రయ విజ్ఞానాన్ని అందించడంతో పాటు భవిష్యత్తులో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి దోహదపడనుంది.

నాలుగు అంశాలపై ప్రదర్శన

ఈ సంవత్సరం సైన్స్‌ సమాజం డ్రామా ఫెస్టివల్‌ కోసం నాలుగు అంశాలను నిర్ణయించింది. 30 నిమిషాలపాటు ప్రదర్శన ఉంటుంది. ఎనిమిది మంది ఒక బృందంగా ఏర్పడి ప్రదర్శన చేయాలి. ఇందులో ఒక స్క్రిప్ట్‌ రైటర్‌తోపాటు ఒక డైరెక్టర్‌ ఉండొచ్చు. డ్రామా ప్రదర్శన, శాసీ్త్రయ అంశం, డ్రామా ప్రభావం ఆధారంగా మొత్తం వందమార్కులకు మూల్యాంకనం జరుగుతుంది. ఇందులో ప్రదర్శనకు 50, శాసీ్త్రయ అంశానికి 30, డ్రామా ప్రభావానికి 20 మార్కులు కేటాయిస్తారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన బృందం రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుంది. అధికారులు సూచించిన నాలుగు అంశాలివే..

నాలుగు అంశాలపై ప్రదర్శనలకు అవకాశం

జిల్లా కేంద్రంలో డ్రామా ప్రదర్శిస్తున్న విద్యార్థులు(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement