మాకేది ‘భరోసా’..! | - | Sakshi
Sakshi News home page

మాకేది ‘భరోసా’..!

Aug 20 2026 3:34 AM | Updated on Aug 20 2026 3:34 AM

● కొత్తగా నమోదైన రైతులకు అందని పెట్టుబడి సాయం ● ఆశగా చూస్తున్న అన్నదాతలు

రెబ్బెన: సాగులో రైతులకు చేదోడువాదోడుగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా ఎకరానికి రూ.12 వేల చొప్పున సీజన్‌కు రూ.6 వేల నగదును నే రుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తోంది. ఇటీవల వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా సాయం ఇప్పటికే రైతులందరికీ అందజేసింది. అయితే కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు, వారసత్వంగా యాజమాన్య హ క్కులు పొందిన వారికి మాత్రం నిరాశ తప్పడం లేదు. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి రా ష్ట్ర ప్రభుత్వం జూన్‌ 30 నుంచి విడుదల చేసింది. మొదట తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల నుంచి ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి ఖాతాల్లో జమ చేసింది. కొత్తగా వారికి ప్రయోజనం చేకూర్చేందుకు జూన్‌ 15 లోపు పట్టా పాస్‌ పుస్తకం పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో జిల్లాలో చాలామంది పట్టా పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జి రాక్స్‌ పత్రాలతోపాటు దరఖాస్తు ఫారం నింపి స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులకు అందించారు.

జిల్లాలో ఇలా..

గత యాసంగితో పోల్చితే వానాకాలం సీజన్‌లో రైతు భరోసా పెట్టుబడి సాయం పొందిన రైతు ల సంఖ్య పెరిగింది. ఏటా రెండు సీజన్లలో పె ట్టుబడి సాయాన్ని అందిస్తుండగా, ప్రతీ సీజన్‌లో కొత్తగా పట్టా పాస్‌ పుస్తకాలు పొందిన రైతు ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గత యాసంగిలో జిల్లాలో 1,32,475 మంది రైతు భ రోసా పెట్టుబడి సాయం అందుకోగా, ఈ వా నాకాలం సీజన్‌లో వారి సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు జిల్లాలో వానాకాలం సీజన్‌ కింద 1,33,860 మందికి ప్రభుత్వం పెట్టుబడి సా యం కింద రూ.2,50,30,62,649 నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. జిల్లాలో పెట్టుబడి సాయం అందుకుంటున్న వారి కంటే భూ మి కలిగి ఉన్న రైతుల సంఖ్య దాదాపు 13 వేలు అధికంగా ఉంది. వ్యవసాయ శాఖ అధికారులకు అవసరమైన పత్రాలు అందించకపోవడం, బ్యాంకు ఖాతాల వివరాలు సరిగా లేకపోవడం వంటి పలు కారణాలతో లబ్ధిదారుల సంఖ్య త గ్గుతోంది. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 1,44,800 మంది రైతులు ఉన్నారు. వీరిలో ఈ వానాకాలంలో 1,33,860 మంది మాత్రమే పెట్టుబడి సాయం అందింది. జూలై 5 లోపు దరఖాస్తు చేసుకున్న కొత్త రైతులు సుమారు ఆరు వేల వరకు ఉండవచ్చు. జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 1.5 లక్షల వరకు చేరుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి

జిల్లాలో జూలై 15 లోగా కొత్తగా పట్టా పాస్‌ పుస్తకం పొందిన రైతుల నుంచి రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులు స్వీకరించాం. ఆన్‌లైన్‌ ప్రక్రియ కూడా పూర్తి చేశాం. ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయగానే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమవుతాయి. – వెంకట్‌, డీఏవో

నెలరోజులు దాటినా..

గత యాసంగిలో జిల్లాలో 1,32,475 మంది రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందారు. వానాకాలం సీజన్‌ పెట్టుబడి సాయం నిధులు విడుదల చేస్తూనే ప్రభుత్వం కొత్తగా వారికి అవకాశం కల్పించడంతో సుమారు ఆరు వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. 15 రోజుల్లో కొత్త రైతులకు సైతం పెట్టుబడి సాయం అందుతుందని చెప్పినా నేటి వరకు విడుదల చేయలేదు. పంటల సాగు కోసం బ్యాంకు రుణాలు, ప్రైవేటు వ్యక్తుల నుంచి వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారు. దరఖాస్తు అందించి నెల రోజులు దాటినా నేటివరకు అందకపోవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టత కూడా లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement