12వ వేజ్‌ బోర్డు కమిటీ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

12వ వేజ్‌ బోర్డు కమిటీ ఏర్పాటు చేయాలి

Aug 10 2026 11:42 PM | Updated on Aug 10 2026 11:42 PM

రెబ్బెన: 12వ వేజ్‌బోర్డు కమిటీ ఏర్పాటు చేసి.. వెంటనే చర్చలు ప్రారంభించాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సోమవారం గోలేటిలోని జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ నాయకులు ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు, అలవెన్సులు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేవరకు ఐక్య పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఏరియా జీఎం శ్రీరమేశ్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ఐఎన్‌టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్‌, హెచ్‌ఎంఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు, గుర్తింపు సంఘం జీఎం కమిటీ సభ్యులు జగ్గయ్య, రాజేశ్‌, మారం శ్రీనివాస్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కిరణ్‌బాబు, చంద్రశేఖర్‌, సమీ, సురేశ్‌ కోరి, ఫిట్‌ కార్యదర్శులు రామయ్య, అశోక్‌, రమేశ్‌, వసీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement