‘కాగజ్‌నగర్‌లో ప్రభుత్వ భూములు కబ్జా’ | - | Sakshi
Sakshi News home page

‘కాగజ్‌నగర్‌లో ప్రభుత్వ భూములు కబ్జా’

Aug 10 2026 11:42 PM | Updated on Aug 10 2026 11:42 PM

ఆసిఫాబాద్‌అర్బన్‌: కాగజ్‌నగర్‌ ప్రాంతంలో ప్రభు త్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం డిమాండ్‌ చే శారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సో మవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడా రు. కాగజ్‌నగర్‌ మండలం కోసిని శివారులో సంకల్ప్‌ గ్రీన్‌ సిటీ పేరుతో సర్వే నం.85/3, 86/3, 87/3 లో లేఅవుట్‌కు అనుమతులు తీసుకుని సర్వే నం.79, 60లో రూ.20కోట్ల విలువైన సుమారు మూడెకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపించారు. అలాగే మున్సిపాలిటీకి చెందిన 216, 217, 218 సర్వే నంబర్లలోని భూమి, శిశుమందిర్‌కు చెందిన భూమి కూడా ఆక్రమణకు గు రైందని తెలిపారు. అనుమతులు ఒకచోట తీసుకుని హద్దులు మార్చి ప్రభుత్వ భూములు కలుపుకొని వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్లాట్లు కొనుగోలు చేస్తే అమాయక ప్రజలు నష్టపోయే ప్ర మాదం ఉందన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారిపై సమగ్ర విచా రణ జరిపించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్‌, నాయకులు కోట్నాక విజయ్‌, సెర్ల మురళి, ఖాండ్రె విశాల్‌, తిరుపతి, సప్త శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement