సంస్కృతి ఉట్టి పడేలా.. | - | Sakshi
Sakshi News home page

సంస్కృతి ఉట్టి పడేలా..

Aug 9 2026 1:46 AM | Updated on Aug 9 2026 1:46 AM

ఆసిఫాబాద్‌: ఆదివాసీ అస్తిత్వానికి ప్రతీకగా జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీ సంఘాలు, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకలకు కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధికారులు, ఆదివాసీ గిరిజన సంఘాల ప్రముఖులు, జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నా రు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో గిరిజ నశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌ కె.హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సంబంధిత అధి కారులతో పాటు తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, రాయ్‌సెంటర్‌ సార్‌మేడీలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆది వాసీ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ది శానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దివాసీ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి.

వేడుకలకు ఏర్పాట్లు

జిల్లా కేంద్రంలోని రాయ్‌సెంటర్‌లో ఆదివారం ప్రత్యేక పూజలు, ఆదివాసీ జెండా ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి కుమురంభీమ్‌ చౌక్‌ వద్ద భీమ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి ఆదివాసీ భవ న్‌కు చేరుకుని కుమురంభీమ్‌ చిత్రపటంతో పా టు ఆదివాసీ ప్రముఖుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా గుస్సాడీ, ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తొమ్మిది తెగలవారు హాజరు కానుండగా ఒక్కో తెగవారు ఒక్కో సాంస్కృతిక ప్రదర్శన నిర్వహిస్తారు. ఆదివాసీ కళలు, ఆచారా లు, సంప్రదాయ దుస్తులు, జీవన విధానాన్ని ప్రతిబింబించేలా నిర్వహించనున్న కార్యక్రమాలు ప్రత్యేకాకర్షణగా నిలవనున్నాయి. వేడుకల్లో పాల్గొనేవారికి జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తాగునీరు, భోజన వసతి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంస్కృతి పరిరక్షణే లక్ష్యం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా ఆదివాసీ హక్కులు, గుర్తింపు, భాష, సంస్కృతి, సంప్రదా యాల పరిరక్షణకు వేదికగా మారాలని ఆది వాసీ సంఘాలు కోరుతున్నాయి. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన అవసరముందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. అడవులు, ప్రకృతి వనరుల ను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణలో ఆదివాసీలు పోషి స్తున్న పాత్రను గుర్తించాలని చెబుతున్నా రు. కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ స మాజం ఎదుర్కొంటున్న విద్య, వైద్యం, ఉపాధి, భూమి హక్కులు, అటవీహక్కులు, జీవో 3, మౌలిక వసతులు తదితర సమస్యలు అధికారుల దృష్టికి తేనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతీ ఆదివాసీకి అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చూడాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఆది వాసీ పిల్లలకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధితోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement