కాగజ్‌నగర్‌టౌన్: ప్రఖ్యాత సాహితీ వేత్త, బహుభాషా కోవిదుడు సామల సదాశివ వర్ధంతిని పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని ఆయ న విగ్రహానికి తెలంగాణ సాహితీ సదస్సు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అలాగే పద్మశాలి భవనంలో ఆ సంఘం నాయకులు సదాశివ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. వక్తలు మాట్లాడుతూ సామల సదాశివ తెలుగు, ఉర్డూ, మరాఠీ, హిందీ, సంస్కృత భాషల్లో విశేష పాండిత్యాన్ని సంపాదించారని, భాషల మధ్య సాహిత్య వారధిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితీ సదస్సు సలహాదారు కటుకం మధుకర్, కార్యనిర్వాహక కార్యదర్శి మామిడాల తిరుపతయ్య, ఎంఈవో ప్రభాకర్, పద్మశాలి సంఘం నాయకులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు శాంతకుమారి, శ్యాంసుందర్, రాజేశ్వర్‌రావు, ప్రకాశ్, ఓం ప్రకాశ్, నానాజీ తదితరులు పాల్గొన్నారు.


