● అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్
ఆసిఫాబాద్‌రూరల్: పిల్లలను ప్రతిరోజూ పాఠశాలలకు పంపించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన టీచర్, పేరెంట్స్ మీటింగ్‌కు హాజరయ్యారు. విద్యార్థుల విద్యాప్రగతి, హాజరు, అభ్యసన సామర్థ్యాలు, క్రమశిక్షణ, భవిష్యత్తు లక్ష్యాలు తదితర అంశాలపై తల్లిదండ్రులతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ ఇంటి వద్ద కూడా విద్యార్థులతో సాధన చేయించాలన్నారు. విద్యాప్రగతిని క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


