కాగజ్‌నగర్‌టౌన్: ప్రిస్క్రిప్షన్ లేకుండా నియంత్రిత మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత హెచ్చరించారు. స్థానిక ఎస్సై రాజు, పోలీసులతో కలిసి శుక్రవారం పట్టణంలోని పలు మెడికల్ షాపుల్లో స్టాక్, కొనుగోళ్లు, అమ్మకాల రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ ట్రామడాల్, అల్ఫ్రాజోలామ్, బుప్రెనోర్పిన్ ఇంజెక్షన్లు, షెడ్యూల్ హెచ్– 1 మందులు వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పై డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


