కాగజ్‌నగర్‌టౌన్: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు 15 ఏళ్లుగా ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, పోలీస్, ఫారెస్ట్, బ్యాంకింగ్ తదితర ఉద్యోగాలకు ఉపయోగపడేలా ఫౌండేషన్ శిక్షణ కోసం డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు ఉపకార వేతనంతోపాటు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తామన్నారు. అనంతరం అధ్యాపకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, కోఆర్డినేటర్ జనార్దన్, అధ్యాపకులు శారద, రాజేశ్వర్, దత్తాత్రేయ పాల్గొన్నారు.


