అంకుసాపూర్‌లో సంయుక్త సర్వే | - | Sakshi
Sakshi News home page

అంకుసాపూర్‌లో సంయుక్త సర్వే

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

కాగజ్‌నగర్‌రూరల్‌: కాగజ్‌నగర్‌ మండలం అంకుసాపూర్‌ గ్రామ పరిధిలోని అటవీ భూములు, పట్టా భూముల విషయంలో నెలకొన్న వివాదంపై రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులు, పట్టేదారులు గురువారం సంయుక్త సర్వే నిర్వహించారు. సర్వే నం. 145లో అటవీ శాఖకు కేటాయించిన 684 ఎకరాల భూములు పోగా, మిగిలిన భూములు పట్టేదారులకే చెందుతాయని ఆర్డీవో కృష్ణయ్య స్పష్టం చేయడంతో స్థానిక రైతులు అంగీకరించారు. భవిష్యత్తులో ఒక నిర్ణీత తేదీన పూర్తిస్థాయి జాయింట్‌ డిమార్కేషన్‌ చేపట్టి సరిహద్దులు నిర్ణయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మధుకర్‌, డీఎఫ్‌వో అప్పయ్య, సర్వేయర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement