ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో గురువారం ప్రజాగాయకుడు గద్దర్‌కు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నార్ రమేశ్ మాట్లాడుతూ గద్దర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కళాకారుడని కొనియాడారు. పాటను ఆయుధంగా మార్చి పేదలు, బడుగు, బలహీన వర్గాల సమస్యలను ప్రపంచానికి వినిపించిన ప్రజా గాయకుడు అని అన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్, డివిజన్ అధ్యక్షుడు ప్రశాంత్, మాలి మహా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగోసె శంకర్, నాయకులు మారుతి, ఉపేందర్, సూర్యవంశీ తదితరులు పాల్గొన్నారు.


