ఆసిఫాబాద్‌అర్బన్: హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో 7, 8వ తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ గిరిజన క్రీడాపాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థినులు ఎంపికయ్యారని హెచ్‌ఎం లింబారావు, వ్యాయామ ఉపాధ్యాయు డు బండ మీనారెడ్డి గురువారం తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు, కోచ్ విద్యాసాగర్‌కు ఐటీడీఏ పీవో మంద మకరందు, డీటీడీవో జాదవ్ అంబాజీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలి పారు. అలాగే పాఠశాల ఆవరణలో ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, ఏటీడీవో చిరంజీవి, హెచ్‌డబ్ల్యూవోలు విజయలక్ష్మి, సరిత, కోచ్‌లు అరవింద్, తిరుమల్ విద్యార్థినులను అభినందించారు.


