ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు(రేషనలైజేషన్) ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాల ని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం డీఈవో సచ్చిదానంద చారితో కలిసి టీచర్ల సర్దుబాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు, ఉపాధ్యాయుల సీనియార్టీ, విద్యార్థుల సంఖ్యను పరి గణనలోకి తీసుకుని సర్దుబాటు చేపట్టాలన్నా రు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేలా కేటాయింపులు ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.


