ఆసిఫాబాద్: జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గా డాక్టర్ సిడాం నాగేంద్ర గురువారం జిల్లా కేంద్రంలో బాధ్యతలు స్వీకరించారు. ఉషే గాం పీహెచ్‌సీ వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న నాగేంద్ర కొన్ని నెలలుగా ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వోగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయనను డీఎంహెచ్‌వోగా నియమిస్తూ వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఉత్తర్వుల జారీ చేశారు. జిల్లాలో వైద్య సేవలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అలాగే ఇప్పటివరకు డీఎంహెచ్‌వోగా విధులు నిర్వర్తించిన సీతారాం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, కాగజ్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌వోగా సేవలందిస్తున్నారు.


