2024 ఫిబ్రవరి 2న ప్రకటించిన పేస్కేల్ జీవోను 2026 ఆగస్టు 15 లోగా అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.
రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతినెలా 1న జీతాలు చెల్లించాలి.
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి.
పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి.
సమాన పనికి సమాన వేతనం అమలు పర్చి ఉద్యోగ భద్రత కల్పించాలి.
కార్యాలయం, ఫీల్డ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇస్తున్న స్పెషల్ అలవెన్స్ రూ.6 వేల వరకు పెంచాలి.
ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఈపీఎఫ్ సవరించి పునఃనిర్ణయించాలి.
తిర్యాణి: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం– 2005 ప్రారంభం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం వీబీ జీ రామ్‌జీ పథకం పరిధిలోకి వచ్చారు. అయితే ఉద్యోగ భద్రత లేకపోవడంతోపాటు వారికి కనీస వేతనాలు అందడం లేదు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో పోరుబాట పట్టారు. జూలై 27 నుంచి పెన్‌డౌన్ కార్యక్రమాల ద్వారా నిరసన తెలుపుతున్నారు. అధికారులకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.
వేతనాల కోసం నిరీక్షణ
జిల్లాలో ప్రస్తుతం టెక్నికల్ అసిస్టెంట్లు(టీఏలు) 74, ఏపీవోలు 11, ఈసీలు ఆరుగురు, కంప్యూటర్ ఆపరేటర్లు 37 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో సహా అందరికీ ప్రతినెలా 1 తేదీనే వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వీబీ జీ రాంజీ ఉద్యోగులకు మాత్రం ఈ ఆదేశాలు అమలు కావడం లేదు. జిల్లాలోని ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నా తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిలిచిన పనులు
వీబీ జీ రాంజీ ఉద్యోగులు పెన్‌డౌన్ చేస్తుండటంతో జిల్లాలో కార్యక్రమాలు నిలిచిపోయాయి. వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఎస్టిమేషన్లు పంపించేవారు కరువయ్యారు. దీంతో నేటికీ మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతల తవ్వకం పూర్తిస్థాయి ముందుకు సాగడం లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి పథకం పనులకు సైతం బ్రేక్ పడింది. గ్రామాల్లో సామూహిక, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.
ప్రధాన డిమాండ్లు ఇవే..


