ఆసిఫాబాద్‌అర్బన్: ఆదివాసీ సంస్కృతి, సంప్రదా యాలు ఎంతో గొప్పవని ఎస్పీ నితిక పంత్ అన్నా రు. ప్రజలకు మరింత చేరువ కావడం, ఆదివాసీ సమాజంతో సమన్వయాన్ని బలోపేతం చేసేందు కు జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గు రువారం ఆదివాసీ పటేళ్లు, నాయకులు, గోండ్వాన రాయిసెంటర్ సర్మెడీలు, సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎంతో మంది యోధులు నడయాడిన నేల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అని, కుమురంభీం, రాంజీగోండ్ వంటి మహనీయుల త్యాగాలు స్ఫూర్తిదాయకమన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, సామాజిక ఐక్యత పెంచడంలో పటేళ్లు, సర్మెడీలు కీలక పాత్రం పోషిస్తున్నారని తెలి పారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. జైనూర్‌లో ప్రతీ సోమవారం ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి నిర్వహిస్తామని తెలిపారు. అలా గే పోలీసు నియామకాల్లో ఉద్యోగాలు సాధించేలా ఆదివాసీ యువతకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అ నంతరం ఆదివాసీ యువకులు తమ గ్రామాల్లోని సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా, పరిష్కారా నికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఆదివాసీ నాయకులు, ప్రజలు, పోలీసు అధికారులు సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, ఆదివాసీ పటేళ్లు, గోండ్వాన రాయి సెంటర్ సర్మెడీలు సిడం అర్జున్‌మాస్టర్, పెందూర్ సుధాకర్, మోతీరాం, బుర్స పోచయ్య, కోవ విజయ్, చిన్నన్న, భీంరావ్, ప్రేమ్‌కుమార్, కిషన్, సభ్యులు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.


