కెరమెరి: కుటుంబాల్లో చిచ్చుపెడుతున్న మద్యం విక్రయాలపై గిరిజన మహిళలు కన్నెర్రజేశారు. కెరమెరి మండలం అగుర్‌వాడా గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళలు గురువారం సర్పంచ్ వాడ్గురే రోజా ఆధ్వర్యంలో బెల్టు షాపులపై దాడులు చేశారు. షాపుల్లోని మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థా నికంగా బెల్టుషాపుల్లో మద్యం తాగి ఇంట్లో పెద్దలు గొడవలకు దిగుతున్నారని, మత్తులో మహిళలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా లుగు రోజుల క్రితమే బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని చెప్పినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులను మరోసారి హెచ్చరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళలు మడావి బాగుబాయి, చహకటి నీలా బాయి, పైకుబాయి, శ్యామలాబాయి, కై నుబాయి, లక్ష్మిబాయి, జంగుబాయి, మంసుబాయి తదితరులు పాల్గొన్నారు.


