కెరమెరి: శిక్షణతో ఉపాధ్యాయుల బోధన మెరుగుపడుతుందని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం రెండో విడత ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు మెరుగుపర్చడంలో ఎఫ్‌ఎల్‌ఎన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రతీ టీచర్ తరగతి గదిలో అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, ఎంఈవో ఆడే ప్రకాశ్, కాంప్లెక్స్ హెచ్‌ఎం చంద్రశేఖర్, ఆర్పీలు శ్రీధర్, నరేశ్, రవితేజ పాల్గొన్నారు.


