కాగజ్‌నగర్‌టౌన్: రేషన్ కార్డుదారుల ఈ– కేవైసీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండలంలోని రేషన్ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియను ఆగస్టు 31లోగా పూర్తి చేయాలన్నారు. కాగజ్‌నగర్ మండలంలో 57 రేషన్ షాపులు ఉండగా 33,386 మందికి ఆహార భద్రత కార్డులు, అందులో 1,11,371 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు 18,857 కార్డులకు సంబంధించిన 57,655 మంది ఈ– కేవైసీ పూర్తయ్యిందని తెలిపారు. 31,646 మంది ఈ– కేవైసీ పెండింగ్ ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణయ్య, తహసీల్దార్ మల్లెపూల మధుకర్, మున్సిపల్ అధికారి రాజేందర్ పాల్గొన్నారు.


