కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మండలం కొత్త సార్సాల గ్రామానికి చెందిన రైతు కందుల పోచయ్య– సుశీల దంపతుల కుమారుడు రాజన్న బుధవారం విడుదలైన పీజీ సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించాడు. స్థానిక రాస్పెల్లి జెడ్పీఎస్‌ఎస్‌లో పదో తరగతి, ఖమ్మం జిల్లా మధిరలో అగ్రిక ల్చర్ డిప్లొమా(82 శాతం మార్కులు) పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని బాబు జగ్జీవన్ రాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్‌సీఎస్) 81 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. పీజీ సెట్ ఫలితాల్లో ఎమ్మెల్సీ బోటనీ విభాగంలో రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంక్‌తో మెరవడంతో ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.


