ఆసిఫాబాద్‌అర్బన్: పోలీస్ ఉద్యోగాల నియామకాల్లో నిబంధనల ప్రకారం 75శాతం కేటాయింపులు వర్తింపజేసి ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ నితిక పంత్‌కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత నోటిఫికేషన్‌లో జనరల్ జీవోల ప్రకారం పోస్టులు ఇవ్వడంతో ఏజెన్సీ ఆదివాసీ అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ పరిగణనలోకి తీసుకుని జీవో నం. 24 ప్రకారం డీఎల్‌ఎస్‌సీ నిర్వహణ అనంతరం ఏజెన్సీ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. కోరారు. సమస్యను పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఎస్పీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆత్రం అర్జున్, ఆత్రం ఆనంద్‌రావు, శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు.
వినతిపత్రం ఇస్తున్న నాయకులు


