ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌: జిల్లాలో ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అధికారులు, తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, రాయ్‌సెంటర్‌ సార్‌మెడిలతో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడు తూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించాలన్నారు. తొమ్మిది గిరిజ న తెగలకు చెందిన ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు ఐకమత్యంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వేడుకల నిర్వహణకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో డీటీడీవో అంబాజీ, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు సిడాం అర్జు, బుర్స పోచయ్య, కుర్సింగ మోతీరాం, మడావి నర్సింగ్‌రావు, చహకటి దస్రు, కొడప విశ్వేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘భూ భారతి’పై అవగాహన అవసరం

ఆసిఫాబాద్‌: భూభారతి పోర్టల్‌పై రెవెన్యూ శాఖ లోని జూనియర్‌ అసిస్టెంట్లకు అవగాహన అవసరమని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం జూనియర్‌ అసిస్టెంట్లకు భూ భారతి పోర్టల్‌పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జూనియర్‌ అసిస్టెంట్లు ఆపరేటర్లపై ఆధారపడకుండా కార్యాలయ పనులతోపాటు భూ భారతి పోర్టల్‌లో నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భూ సేకరణ అంశాలు, దరఖాస్తులు, ఇతర అంశాలతో పాటు ఏ పనిని అప్పగించినా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్లు రాము, రవి కాంత్‌, జిలాని పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement