ఆసిఫాబాద్‌రూరల్: కాగజ్‌నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం 39వ ఫౌండేషన్ డే వేడుకలు నిర్వహించనున్నట్లు డీఈవో సచ్చిదానంద చారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవోదయ ప్రిన్సిపాల్ రేపాల కృష్ణతో కలిసి మాట్లాడారు. నవోదయ విద్యాలయాలు పేద విద్యార్థులకు వరం లాంటివని తెలిపారు. జిల్లాలోని అర్హులు ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఈ నెల 7లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 1986లో ప్రారంభమైన జవహర్ నవోదయ పాఠశాల ఎంతో మందికి దారి చూపిందని తెలిపారు. ఇప్పటివరకు తమ పాఠశాల నుంచి ఏడుగురు సర్వీసెస్‌కు ఎంపికయ్యారన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఏఐ, మల్టీ స్కిల్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో పీజీటీ డాక్టర్ రామయ్య, పేరెంట్ కమిటీ మెంబర్ ఊషన్న, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.


