పిల్లల రక్షణ కోసమే పోక్సో చట్టం | - | Sakshi
Sakshi News home page

పిల్లల రక్షణ కోసమే పోక్సో చట్టం

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

కెరమెరి: పిల్లల రక్షణ కోసమే పోక్సో చట్టం రూపొందించారని, దీనిపై ప్రతీ విద్యార్థి అవగాహన పెంచుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి సంకేత్‌ మిత్ర అన్నారు. మండలంలోని ఝరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పలు చట్టాల గురించి వివరించారు. రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, మహిళల రక్షణ, సైబర్‌ నేరాలు, సోషల్‌ మీడియా మోసాలు, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌, బాల్యవివాహాల నిషేధం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లలపై లైంగిక వేధింపులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎలాంటి వేధింపులకు గురైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆడే ప్రకాశ్‌, హెచ్‌ఎం భరత్‌కుమార్‌, ఏఏపీసీ చైర్‌పర్సన్‌ రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement