అనుమానిత వ్యక్తుల సమాచారం అందించాలి | - | Sakshi
Sakshi News home page

అనుమానిత వ్యక్తుల సమాచారం అందించాలి

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

రెబ్బెన: బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు అందించాలని డీఎస్పీ అశోక్‌ అన్నారు. మండలంలోని ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌లో మంగళవారం తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆటోస్టాండ్‌లో డ్రైవర్లతో మాట్లాడారు. అక్రమ రవాణాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటో డ్రైవర్లు సహకరించొద్దన్నారు. గంజాయి అమ్మినా తాగినా కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గంజాయికి సంబంధించి సమాచారం ఉన్నా తెలియజేయాలని సూచించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించే అవకాశం లేనివారు ఈగల్‌ ఫోర్స్‌కు 1908 కాల్‌ చేయాలని కోరారు. కార్యక్రమాల్లో రెబ్బెన సీఐ సంజయ్‌, ఎస్సై వెంకటకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement