వర్షాలకు బురదమయంగా రోడ్లు గ్రామీణ ప్రాంతాలకు అందని అంబులెన్సు సేవలు స్కానింగ్, వైద్య పరీక్షలకు తప్పని ఇబ్బందులు
పెంచికల్‌పేట్: ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. జిల్లాలోని మా రుమూల గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో గర్భిణుల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. భారీ వర్షాలకు మట్టిరోడ్లు బురదమయంగా మారడంతో 108, 102 అంబులెన్స్‌లు నడవడం లేదు. గిరిజన గ్రామాల నుంచి వైద్యం కోసం కాలినడకన, ప్రైవేటు వాహనాల్లో అస్పత్రులకు చేరుకుంటున్నారు. ఇటీవల పెంచికల్‌పేట్ మండలం మురళీగూడ గ్రామానికి చెందిన ఆరుగురు గర్భిణులు నెలవారీ వైద్యపరీక్షలకు కాలినడకన సుమారు కిలోమీటరు నడిచారు. ఆ తర్వాత అక్కడి నుంచి 3 కిలోమీటర్లు గూడ్స్ వాహనంలో ప్రయాణించి 102 వాహనం వద్దకు చేరుకున్నారు. అనంతరం 102 వాహనంలో ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకున్నారు. ఏటా జిల్లాలో ఎక్కడో ఒకచోట రోడ్డు సౌకర్యం లేక సకాలంలో వైద్యం అందక మాతాశిశు మరణాలు నమోదవుతున్నాయి.
135 హైరిస్క్ గ్రామాలు
జిల్లాలోని 15 మండలాల్లో ఈ సీజన్‌లో 619 మంది గర్భిణులను గుర్తించారు. ఇందులో ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 330 ప్రసవాలు జరిగాయి. ఎలాంటి రహదారి సౌకర్యం లేని 135 గ్రామాలను వైద్యారోగ్య శాఖ అధికారులు హైరిస్క్ గ్రామాలుగా గుర్తించారు. ఆయా గ్రామాల్లో 34 మంది గర్భిణులు ఉన్నట్లు గు ర్తించగా, ఇందులో 26 మందికి ప్రసవం జరిగింది. పెంచికల్‌పేట్ మండలంలోని నందిగామ, మురళీగూడ, జిల్లెడ, కమ్మర్‌గాం, మెరెగూడ, దహెగాం మండలంలోని మొట్లగూడ, రాంపూర్, లోహ, బెజ్జూర్ మండలంలోని సోమిని, మొగవెల్లి, సుశ్మీర్, చింతలపల్లి, చింతలమానెపల్లి మండలంలోని దిందా, కాగజ్‌నగర్ మండలంలోని మానిక్‌పటార్, మాలిని, సిర్పూర్(టి) మండలంలోని ఇటికలపహా డ్‌తో పాటు ఆసిఫాబాద్ డివిజన్‌లోని ఏజెన్సీ గ్రా మాల్లో చాలా గ్రామాలకు సరైన రహదారులు లేవు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లు బురదమయంగా మారాయి. కనీసం రోడ్ల వెంట 108 వాహనాలు నడిచే కూడా అవకాశం లేదు. దీంతో వైద్యం కోసం గర్భిణులకు ఇక్కట్లు తప్పడం లేదు. హైరిస్క్ గ్రామాల్లో గర్భిణులను ముందస్తుగా అస్పత్రులకు తరలించి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలో గర్భిణుల వివరాలు
ప్రభుత్వ ఆస్పత్రులు


