కాగజ్‌నగర్‌టౌన్/కౌటాల: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించిన యాప్‌లోనే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని డీఏవో వెంకట్ అన్నారు. కాగజ్‌నగర్ మండలం వంజీరి రైతు వేదికలో దహెగాం, కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, సిర్పూర్(టి) మండలాలు, కౌటాల రైతు వేదికలో బెజ్జూర్, కౌటాల, చింతలమానెపల్లి మండలాలకు చెందిన ఎరువుల డీలర్లతో సోమవారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి ఫర్టిలైజర్ యాప్‌లోనే యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. కొత్త యాప్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెట్‌కు యూరియా సరఫరా తగ్గుతుందని తెలిపారు. సమావేశాల్లో ఏడీఏ మనోహర్, ఏవోలు రామకృష్ణ, కార్తీష, నాగరావు, ఏఈవోలు శ్రీనివాస్ అంజన్న, ఘాన్‌శ్యాం, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


